NTV Telugu Site icon

పక్కాగా ప్లాన్ చేసి చంపేసి…మిస్ ఫైర్ అన్నాడు.. చివరికి దొరికేసిన హోంగార్డు !

పక్కా ప్లాన్‌తో  భార్యను హత్య చేశాడు భర్త. హత్యను మిస్‌ ఫైర్‌గా చిత్రీకరించబోయే అడ్డంగా దొరికిపోయాడు. బెజవాడ మిస్ ఫైర్‌ ఘటనలో అసలు నిజాలు బయటకు వచ్చాయి. భార్య రత్న ప్రభను హోంగార్డ్ వినోద్‌ ఉద్దేశపూర్వకంగానే  కాల్చి చంపాడని  పోలీసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినోద్, రత్న ప్రభ  కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ ఘర్షణ సమయంలో వినోద్ తన దగ్గర ఉన్న తుపాకితో కాల్చి చంపాడని తెలుస్తోంది. మొదట తుపాకి మిస్‌ ఫైర్‌ అయి తన భార్య చనిపోయిందని డ్రామాలాడాడు వినోద్‌. అర్దరాత్రి ఈ ఘటన జరగడం తో అనుమానం వచ్చిన పోలీసులు  తమదైన శైలిలో విచారించి  నిజాలు కక్కించారు. బంగారు నగలు తాకట్టు విషయంలో గొడవ జరిగి హోమ్ గార్డ్ వినోద్ ..భార్య పై ఫైర్ చేయడం వల్ల ఆమె చనిపోయిందని విజయవాడ సీఎపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. రెండు నెలలుగా వీరి మధ్య గొడవ జరుగుతుందని, తాకట్టు పెట్టిన ఆ నగలు విడిపించమని ఒత్తిడి చేసిందన్నారాయన. హోంగార్డ్ మీద ప్రస్తుతం మర్డర్ కేసు కట్టామని, విచారణ జరుగుతుందని చెప్పారు సీపీ.