Site icon NTV Telugu

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

raghu rama krishnam raju

raghu rama krishnam raju

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే వరుస లేఖలతో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న రఘురామకృష్ణ… ఈసారి మరో సమస్యను తన లేఖలో లేవనెత్తారు. నవ ప్రభుత్వాల కర్తవ్యాల పేరుతో ఈసారి రఘురామ లేఖ రాశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షల రద్దుపై ఈనెల 1న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.

read also : నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ…వీటిపైనే చర్చ !

కరోనా బారీ నుంచి పిల్లలను కాపాడేందుకే ప్రధాని నిర్ణయం తీసుకున్నారని… అలాగే అన్ని రాష్ట్రాలు కూడా బోర్డు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా టైంలోనూ పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉందని మండిపడ్డారు. విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని… ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారని లేఖలో రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

Exit mobile version