NTV Telugu Site icon

చంద్రబాబు చరిత్ర అంత కుట్రల మయం: అవంతి

చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. మోకాలికి బోడిగుండుకు లింకుపెట్టే తత్వం చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు చరిత్ర అంత కుట్రల మయమేనని, పార్టీ ఆఫీసులో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలనా పెట్టాలా..? చంద్రబాబు జీవితమే నేరాల చిట్టాఅన్నారు. వంగవీటి రంగా, మల్లెల బాజ్జీ, ఎన్టీఆర్‌ మరణాలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. నీతికి నిలబడిన ముద్రగడ కటుంబంపై అమానుషంగా ప్రవర్తించిది మర్చిపోయారా అని ఘాటుగా వ్యాఖ్యనించారు.

చంద్రబాబుకి మతిమరుపు ఎక్కువని, ఆయన చేసిన పనులు మరిచి ఇప్పుడు నీతి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు అవంతి శ్రీనివాస్‌.. టీడీపీకి, లోకేష్‌కు జనం ఆదరించారనే ఒత్తిడిలో చంద్రబాబు ఉన్నారన్న ఆయన. మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు..ఒళ్లుకొవ్వెక్కిన పట్టాభి కోసం దీక్ష చేయడం ఏంటన్న రు…? పట్టాభిని పిచ్చాసుపత్రిలో పెట్టాలని, పిచ్చోడి మాటలు పట్టుకుని చంద్రబాబు వేళాడుతున్నారన్నారు. టీడీపీలో పట్టాభి ఎవరూ..? చంద్రబాబు ఆలోచనలతో పార్టీలో ఉన్న నాయకులే తలలు పట్టుకుంటున్నారన్నారు.

అయ్యన్న పాత్రుడు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయన్నారు. గంజాయి గురించి మాట్లాడితే ముందు అయ్యన్న పాత్రుడుని అరెస్టు చేయాలన్నారు. వైసీపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి అయిపోయారు ఇక చంద్రబాబుకి, టీడిపీకి మిగిలింది జనాన్ని తిట్టడమే నని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను ప్రజలు, మేధావులు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు అవంతి శ్రీనివాస్‌.