కర్నూలు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట రాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు. భార్య జయంతి కాపురానికి రాలేదని మనస్తాపంతో డీజిల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది గమనించిన సెంట్రీ కానిస్టేబుల్ నాగరాజు మంటలను ఆర్పీ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు జిజిహెచ్ కు తీసుకెళ్లారు. మంటలు అదుపు చేసేక్రమంలో కానిస్టేబుల్ నాగరాజుకు గాయాలు అయ్యాయి. రాజు కర్నూలు నివాసిగా గుర్తించారు. వెల్దుర్తి మండలం గుంటుపల్లి లో వివాహం చేసుకున్న రాజు భార్య కాపురానికి రావడంలేదని 6 నెలల క్రితం ఫిర్యాదు చేసాడు. ఎన్ని రోజులు గడిచిన భార్య రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం…
