Site icon NTV Telugu

పోలీసులు వేధిస్తున్నారంటూ రాజమండ్రిలో యువకుడు ఆత్మహత్య

పోలీసులు వేధిస్తున్నారంటూ రాజమండ్రి రూరల్ పిడుంగొయ్య గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి పోలీసులే కారణమని సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఉరి వేసుకున్నాడు యువకుడు. గత ఏడాది తెలంగాణ నుంచి రెండు మద్యం బాటిళ్లు తీసుకు వస్తూ కృష్ణాజిల్లా చిలకల్లు చెక్ పోస్టు వద్ద పోలీసులకు చిక్కాడు యువకుడు. ఏడాది తరువాత తనపై మద్యం కేసును లక్ష రూపాయలతో సెటిల్ చేసుకోవాలని యువకుడికి శివ అనే కానిస్టేబుల్ వేధింపులకు గురి చేస్తున్నాడు. లక్ష రూపాయిలు చెల్లించకపోతే గంజాయి కేసులో ఇరికిస్తానని కానిస్టేబుల్ శివ బెదిరించినట్టు ఆరోపిచాడు మృతుడు. అయితే పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపిస్తున్న యువకుడి కుటుంబసభ్యులు… ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పిచ్చికి మజ్జి అనే యువకుడు.

Exit mobile version