Site icon NTV Telugu

కారు పార్కింగ్ గొడవ.. దారుణ హత్య

కర్నూలులో దారుణం జరిగింది. సంతోష్ నగర్‌‌లో మహేశ్వర రెడ్డిని (35) కిరాతకంగా హత్య చేయడం కలకలం రేపింది. మహేశ్వరరెడ్డి తెలంగాణలో ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు మరో వ్యక్తితో రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత మహేశ్వర రెడ్డిని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. హత్య వెనుక రియల్ ఎస్టేట్ వివాదాలు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version