Site icon NTV Telugu

Gannavaram Airport: అనుకూలించని వాతావారణం.. గాల్లో విమానం చక్కర్లు

Flight

Flight

Gannavaram Airport: దట్టమైన పొగమంచు రవాణా వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతోంది.. ఇప్పటికే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కారణంగా.. కొన్ని విమానాలు ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు మళ్లించిన విషయం విదితమే కాగా.. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా.. విమానాలు ల్యాండ్‌ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.. ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్ పోర్టు (గన్నవరం) కు చేరుకోవాల్సిన విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా, ఎయిర్ బస్ విమానం గాల్లో అరగంటకు పైగా చక్కర్లు కొట్టింది.. వాతావరణంలో దట్టమైన పొగ మంచు ఏర్పడటంతో ఏటీసీ క్లియరెన్స్ లేక సేఫ్ ల్యాండింగ్‌కు ఇబ్బంది పడాల్సి వచ్చింది.. దీంతో ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఎ 320_251ఎన్ గాల్లో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత కొంత వాతావరణం అనుకూలించడంతో.. విమానాన్ని ల్యాండ్‌ చేశారు..

Read Also: Trump: నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు.. రష్యా చమురుపై ట్రంప్ వ్యాఖ్య

Exit mobile version