Site icon NTV Telugu

గుడ్‌న్యూస్.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో కీలక మార్పులు

YS Jagan

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభవార్త చెప్పింది కేబినెట్ స‌మావేశం.. ఓటీఎస్ రుసుం త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.. ఇక‌, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో కీలక మార్పుల‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్‌ కట్టే వెసులుబాటు కల్పించింది వైసీపీ స‌ర్కార్.. ఈ మేర‌కు ఓటీఎస్‌ కింద చెల్లించాల్సిన రుసుములుకు సంబంధించిన సవరణలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.. రుణం తీసుకుని చెల్లించకున్నా, అలాంటి ఆస్తి చేతులు మారినా.. ఒకే స్లాబ్‌ వర్తింపు జేస్తూ తీసుకున్న తీర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. మ‌రోవైపు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో రూ.15వేలు, నగరపాలక సంస్ధల్లో రూ.20వేలుగా ఓటీఎస్‌ ఛార్జీలను సవరిస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోగా.. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. గరిష్ట సంఖ్యలో పేదలు లబ్ధి పొందేందుకు వీలుగా ఈ సవరణలు చేసినట్లు మంత్రివర్గం పేర్కొంది..

Exit mobile version