Hindu vs Christians: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంతంలో చర్చి కార్యకలాపాలపై హిందూ సంఘాల ఆందోళన చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రామాలయం పక్కనే అనుమతి లేకుండా చర్చి నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ హిందువులు పెద్ద సంఖ్యలో చర్చి ముందు నిరసన వ్యక్తం చేశాయి. అయితే, చర్చి లోపల క్రైస్తవులు ప్రార్థనలు చేస్తుండగా, బయట హిందూ సంఘాల కార్యకర్తలు “జైశ్రీరామ్” నినాదాలు చేస్తూ ధర్నా్కు దిగారు. చర్చిని మూసివేసేంత వరకు అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Read Also: Phone battery: చలికాలంలో ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఎందుకు.?
ఇక, హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ.. రామాలయంలో భజనలు జరుగుతున్న సమయంలో పెద్ద పెద్ద స్పీకర్లతో చర్చిలో ప్రార్థనలు చేస్తున్నారు, ఇది తమ మనోభావాలను దెబ్బ తీస్తోందని తెలిపారు. ఈ సంఘటన గురించి తెలిసిన పోలీసులు, ఆర్డీవో సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గొల్లప్రోలులో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, చర్చి నిర్వహణ, హిందూ సంఘాల ప్రతినిధులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.
