Site icon NTV Telugu

Palestinian Flags: పాలస్తీనా జెండాలతో యువకుల ర్యాలీ.. వివరణ అడిగిన ముస్లీం మత పెద్దలు

Kkd

Kkd

Palestinian Flags: కాకినాడలో మిలాద్ ఉన్-నబీ ర్యాలీ సందర్భంగా పాలస్తీనా జాతీయ జెండాలతో కార్లలో వెళ్లిన యువకులను ముస్లీం మత పెద్దలు వివరణ అడిగారు. తప్పు జరిగింది ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కానివ్వమని సదరు యువకులు క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మిలాద్ ఉన్-నబీ ర్యాలీలో పాల్గొంటూ కార్లపై పాలస్తీనా జెండాలను కొందరు ముస్లిం యువకులు ఎగుర వేసినట్లు గుర్తించారు.

Read Also: Operation Gibraltar: సెప్టెంబర్ 6, 1965లో కాశ్మీర్‌లో ఏమైంది.. ఆపరేషన్ జిబ్రాల్టర్‌తో పాక్‌‌కు ఏంటి సంబంధం?

ఈ ఘటనపై కొందరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పాలస్తీనా జాతీయ జెండాలను ఎందుకు ప్రదర్శించారు? ఎవరు తయారు చేశారు? బయట నుంచి ఎవరైనా వచ్చారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కానీ, యువకులు మాత్రం తమకు వేరే ఉద్దేశం లేదని, పాలస్తీనా యుద్ధంలో అమాయకులు చనిపోతున్నందుకు వారికి సపోర్టుగా మాత్రమే ఈ జెండాలను ప్రదర్శించామని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version