Kakinada: కాకినాడ జీజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యంతో అర్ధరాత్రి గర్భిణి మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పాంటో ప్రజోల్ మెడిసన్ తనకు రియాక్షన్ ఇస్తుందని ముందుగానే 8 నెలల గర్భిణి మల్లీశ్వరి సమాచారం ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ మల్లీశ్వరికి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పిన పేషెంట్ వదిన, ఏఎన్‌ఎం ధనలక్ష్మీ తెలిపింది.
Read Also: Travis Head Record: 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఏళ్ల నాటి రికార్డులు బ్రేక్!
ఇక, అయినప్పటికీ అదే ఇంజెక్షన్ ను ట్రైనీ పీజీ ఇచ్చింది. దాంతో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లి గర్భిణీ మల్లీశ్వరి మృతి చెందింది. అయితే, సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే, ఈ ఘటనపై విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపింది. పీజీ నిర్లక్ష్యం వల్లనే 8 నెలల గర్భిణి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
