కువైట్ ఆర్దియ హత్యకేసుల నిందితుడు వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్ సెంట్రల్ జైలులోనే సూసైడ్‌కు పాల్పడ్డాడు. కువైట్‌లో ముగ్గురిని హత్యచేసిన కేసులో వెంకటేష్ మీద ఆరోపణలు రావడంతో.. అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై అధికారుల ఆరా తీస్తున్నారు. వెంకటేష్ స్వస్థలం కడప జిల్లా. జైల్లోనే ఉరివేసుకొని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు. మంచానికి ఉన్న వస్త్రంతో ఉరివేసుకొని చనిపోయినట్లు తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: AP Assembly: సెల్ ఫోన్లకు నో పర్మిషన్… స్పీకర్ రూలింగ్
బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లిన కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన వెంకటేష్.. అక్కడ ఓ ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరాడు. రెండేళ్ల తర్వాత వెంకటేష్ తన భార్య స్వాతిని కూడా అక్కడికి తీసుకెళ్లారు.. దంపతులు ఇద్దరూ అక్కడే ఉంటుండగా, వారి ఇద్దరు పిల్లలు మాత్రం.. తాత దగ్గరే ఉంటున్నారు.. అయితే, వెంకటేష్ పనిచేస్తున్న ఇంట్లో ఈ నెల 6వ తేదీన దొంగలు పడ్డారు.. ఇంటి యజమానితో పాటు అతడి భార్య, కూతురిని హత్య చేసి.. దొరికినంతా దోచుకున్నారు.. కానీ, ఈ కేసులో వెంకటేష్‌పై కువైట్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ అరెస్ట్ చేశారు. ఇంతలోనే వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది.