Site icon NTV Telugu

Janasena: కాపు, కమ్మల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్లాన్.. అమర్‌నాథ్‌ కాపు కాదు.. రెడ్డి..!

Pothina Mahesh

Pothina Mahesh

జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కాపు, కమ్మ కులస్తుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.. అమర్‌నాథ్‌ అవాకులు, చవాకులు పెలుతున్నారు. ఆయన్ని ఎవరూ కాపులుగా చూడట్లేదు.. అమర్నాథ్ రెడ్డి అని పిలుస్తున్నారు అంతా అని ఎద్దేవా చేశారు.. వైసీపీ నాయకుల శరీరంలో ప్రవహించేది బ్రిటీష్ రక్తం… విభజించు పాలించు పద్ధతి వారిది అని విమర్శించారు. ఐటీ పాలసీ మీద మాట్లాడాల్సిన అమర్‌నాథ్‌ ఎప్పుడైనా మాట్లాడారా..? మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చాడు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Read Also: Pawan Kalyan: పవన్‌ది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన..! లాజిక్‌ చెప్పిన మంత్రి..

ఇక, బ్లూ ఫిల్మ్ లు తీయడమే వైసీపీ నాయకుల లక్ష్యం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు పోతిన మహేష్.. రికార్డింగ్ డ్యాన్స్‌లు వెయ్యటానికే అమర్‌నాథ్‌ పనికొస్తాడు… మంత్రిగా పనికిరాడు అని వ్యాఖ్యానించిన ఆయన.. నీలిచిత్రాల వీడియోలు బయటకు వచ్చేవి.. కాపులవి, కురుబలవే.. కానీ, మిగతా వైకాపా నాయకులవి బయటకు రావు అని పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గం అయితే వారి వీడియోలు బయటకు రావని ఆరోపించారు. రాష్ట్రంలో మోసపోయిన రెడ్డి సామాజిక వర్గానికి జనసేనాని పవన్‌ కల్యాణ్ అండగా వుంటారు అని ప్రకటించారు. కాపు సామాజిక వర్గంలో పుట్టిన అంబటి, అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, పేర్ని నాని.. కాపు ద్రోహులు అని విమర్శించారు. మరోవైపు.. గతంలో 140 స్థానాల్లో పోటీ చేశాం… రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌.

Exit mobile version