ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇప్పటికే ఓసారి జబర్డస్త్ లో లేడీ గెటప్స్ తో పేరు తెచ్చుకున్న హరి అరెస్ట్ అయ్యాడు.. మరోసారి అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.. హరి పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు గతంలో నిర్ధారించగా.. మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. శేషాచల అడవుల్లో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. నాగపట్ల, వెస్ట్ బీట్, చీకిమానుకోన దగ్గర 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు.. అయితే, గతంలో అక్రమ రవాణాలో కేసులో అరెస్ట్ అయిన జబర్దస్త్ ఫేమ్ హరిబాబుకు.. ఈ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని చెబుతున్నారు పోలీసులు.. తాజా ఘటనలో రూ.3 లక్షల విలువైన 8 ఎర్రచందనం దుంగలు, రెండు నాటు తుఫానులు స్వాధీనం చేసుకోగా.. ఫైనాన్సర్ జబర్దస్త్ హరి కోసం ప్రత్యేక బృందాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్ ఆర్టిస్ట్.. మరోసారి..!
Jabardasth Hari