NTV Telugu Site icon

ISRO’s SSLV D1 Rocket Launch: ఎస్‌ఎస్‌ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం

Sslv D1 Rocket

Sslv D1 Rocket

ISRO’s SSLV Launch: శ్రీహరికోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన SSLV D1 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఆదివారం ఉదయం 9.18 గంటలకు నిప్పులు చిమ్ముతూ SSLV D1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 13.2 నిమిషాల్లో కక్ష్యలోకి చేరింది. ఈఓఎస్ 02, అజాదీశాట్ ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. అజాదీ కా అమృత్ మహోత్సవ వేళ ఈ చిన్న శాటిలైట్ వెహికిల్‌ను ఇస్రో ప్రయోగించి చరిత్ర సృష్టించింది. 75 స్కూళ్ల విద్యార్థినులు అజాదీశాట్ ఉపగ్రహాన్ని రూపొందించారు. 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించారు. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేయగా.. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేశారు.నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్‌–2ఏ(ఈఓఎస్‌శాట్‌)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెట్టారు.