NTV Telugu Site icon

Indrakeeladri Bhavani Deeksha: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ.. భక్తులకు ఇక్కట్లు

Bhavani

Bhavani

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం డిసెంబర్ మాసం వచ్చిందంటే భవానీ దీక్షల విరమణతో సందడిగా ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై భవాని దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభం అయ్యాయి….దీక్ష విరమణలకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు….ఉదయం ఆరున్నరకు మూడు హోమగుండాలకు అగ్ని ప్రతిష్టాపన చేసి దీక్ష విరమణలను వైదిక కమిటీ ప్రారంభించింది…ఇవాల్టి నుండి 19 వరకు మండల,అర్ధ మండల దీక్ష విరమణలు జరగనున్నాయి….మొదటి రోజే భవాని భక్తుల రద్దీ తో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది.

సర్వదర్శనానికి రెండు క్యూ లైన్స్ మాత్రమే ఇవ్వటంతో క్యూ లైన్స్ లో భక్తులకు ఇక్కట్లు తప్పటం లేదు…గంటల పాటు క్యూలైన్స్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని కనీసం మంచినీరు కూడా ఇచ్చేవారు లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో కిక్కిరిసిపోయాయి క్యూలైన్లు. దుర్గమ్మ దర్శనం కోసం అర్ధరాత్రి నుండే క్యూ లైన్స్ లోనే భక్తులు వేచి వున్నారు. ఉచిత దర్శనానికి రెండు క్యూ లైన్స్ మాత్రమే ఇవ్వటంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు భక్తులు. వేల సంఖ్యలో భవానీ మాలవిరమణకు తరలి వస్తున్నారు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో దర్శనానికి ఇక్కట్లు తప్పటం లేదని భక్తులు మండిపడుతున్నారు.

Read Also:Praja Sangrama Yatra Today End: బండిసంజయ్‌ పాదయాత్ర నేటితో ముగింపు.. బహిరంగ సభకు నడ్డా

భవాని దీక్షలు సందర్భంగా నగరంలో 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ మీదుగా వాహనాలకు అనుమతి రద్దు చేశారు. హైకోర్ట్, సెక్రటేరియట్ ఉద్యోగులు కనకదుర్గమ్మ వారధి మీదుగా వెళ్లాల్సి వుంటుంది. విజయవాడ నుండి హైదరాబాద్,జగ్గయ్య పేట ,తిరువూరు ఆర్టీసీ బస్సులు మళ్లిస్తారు. బస్టాండ్ ,వారధి జంక్షన్ ,స్క్రూ బ్రిడ్జి ,బెంజి సర్కిల్ కొత్త ఫ్లైఒవర్,మహానాడు జంక్షన్ ,రామవరప్పాడు రింగ్ వాహనాలను గొల్లపూడి బై పాస్ – గొల్లపూడి y జంక్షన్ మీదుగా మళ్లింపలు వుంటాయి.

Read ALso: Bhakthi Tv Live Thursday: మార్గశిర గురువారం ఈ స్తోత్రం వింటే..

Show comments