NTV Telugu Site icon

రాజమండ్రిలో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం..

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా పలుచోట్ల జోరు వాన కురిసింది. ఇలా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లపైకే కాదు ఇళ్లలోకి కూడా నీరు చేరాయి. అంతేకాదు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు చేరడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్నటి నుంచి ఆగకుండా వర్షం కురుస్తుండటంతో ఆఫీసు అంతా మునిగి పోయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. అక్కడి ప్రజలు ఇక్కట్లు ఎదురుకుంటున్నారు. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో జన జీవనం స్తంభించి పోయింది.