Vasireddy Padma Resigns from YCP: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు సీనియర్ నేత వాసిరెడ్డి పద్మ.. ఈ సందర్భంగా ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు.. ”YCPకి గుడ్ బై”.. వైయస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తూ మీడియా ద్వారా తెలియచేస్తున్నాను అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ.. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పద్మ..
Read Also: Badvel Inter Girl Incident: ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని హత్య.. బాధిత కుటుంబానికి సీఎం భరోసా..
”పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’, ప్రమోషన్లు అంటున్నారు.. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ”.. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారు..” అంటూ లేఖలో దుయ్యబట్టారు.. ఇక, “పార్టీని నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు.. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది.. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేసాను. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను..” అంటూ ఓ లేఖను విడుదల చేశారు వాసిరెడ్డి పద్మ..