Tenali: గుంటూరు జిల్లా తెనాలిలో మద్యం మత్తులో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి స్థానికులను తీవ్ర గందరగోళానికి గురి చేశాడు. తాడింగి అశోక్ అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకురావాలని, తనతో కలపాలని డిమాండ్ చేస్తూ టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. ఇక, అశోక్ టవర్ ఎక్కి పెద్దగా అరుపులు చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దని ఆ యువకుడికి స్థానికులు కోరారు.
Read Also: Dasara Holidays: విద్యార్థులకు పండగే.. ఈ నెల 21 నుంచే దసరా సెలవులు.. ఎప్పటి వరకు అంటే?
ఇక, స్థానికుల ప్రయత్నాలతో అశోక్ చివరికి సెల్ టవర్ పై నుంచి కిందకు దిగాడు. అయితే, టవర్ దిగిన తర్వాత కూడా అతడు హడావిడి చేశాడు. తన ప్రేమికురాలిని ఎందుకు తీసుకురాలేదని స్థానికులతో వాగ్వాదానికి దిగాడు. ఆ యువకుడి తీరుపై మండిపడిన స్థానికులు ఆగ్రహంతో అశోక్‌కు దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు.
