NTV Telugu Site icon

సమ్మె విరమించిన ఎన్టీఆర్‌హెచ్‌యూ ఉద్యోగులు

NTR Health University

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నిధులు రూ. 400 కోట్లు బదలాయింపుని వ్యతిరేకిస్తూ ఈ నెల 1నుండి ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అయితే వీసీ, రిజిస్ట్రార్‌లు పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు మరోసారి ఉద్యోగులతో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రాసిన లేఖల గురించి రిజిస్ట్రార్ వివరించారు.

రూ.175 కోట్లు వెనక్కి ఇవ్వాలన్న అంశాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు. అంతేకాకుండా ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. తక్షణమే విధులకు హాజరవుతున్నట్లు ప్రకటన చేశారు.