Site icon NTV Telugu

Galla Jayadev: దావోస్ పర్యటనలో కేటీఆర్‌తో చర్చలో పాల్గొన్న టీడీపీ ఎంపీ

Galla Jayadev

Galla Jayadev

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్‌తో పాటు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ అధినేత హోదాలో దావోస్ స‌ద‌స్సుకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ హాజరయ్యారు. ఇప్పటికే కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురితో క‌లిసి ఓ చ‌ర్చ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్ తాజాగా మరో సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాల్గొనడం విశేషం. ఈ మేరకు ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేశారు.

Jagan Davos Tour: ఏపీలో రూ.5,600 కోట్ల పెట్టుబడులపై మిట్టల్ ప్రకటన

ఇండియాస్ గ్రోత్ స్టోరీ పేరిట సీఎన్బీసీ టీవీ18 నిర్వహించిన ఓ చ‌ర్చా వేదిక‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ స‌హా తెలుగు నేల‌కు చెందిన మ‌హిళా పారిశ్రామిక‌వేత్త శోభ‌నా కామినేని, భార‌త్‌కు చెందిన పారిశ్రామిక‌వేత్తలు సంజీవ్ బ‌జాజ్‌, ఆశిష్ షాల‌తో క‌లిసి టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా పాల్గొన్నారు. కాగా ఎనర్జీ రంగానికి చెందిన పలు పరిశ్రమల ప్రతినిధి బృందాలను కలిసేందుకు తాను దావోస్ సదస్సుకు హాజరైనట్లు ఇప్పటికే గల్లా జయదేవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version