Site icon NTV Telugu

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి…

గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుత ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 8,60,828 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసింది విపత్తుల నిర్వహణ శాఖ. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యలకోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా చింతూరు లో రెండు బృందాలు, వి.ఆర్ పురంలో ఒక బృందం ఉంది. ఇక సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలి… గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి… బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం,చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు అని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ప్రజలకు తెలిపారు.

Exit mobile version