చేపలను పట్టుకునేందుకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి వల వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పడవలను తీసుకొని చేపల వేటకు వెళ్తే, కొన్ని చోట్ల చిన్న పడవలతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్తుంటారు. సాధారణంగా రాత్రి సమయాల్లో ఎక్కువ చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. అయితే, విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇప్పుడు కొమ్ముకోనెం చేపల భయం పెట్టుకుంది. సుమారు 150 నుంచి 200 కేజీల బరువు వరకు ఉంటాయి. ఇలానే, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా వారికి వలలో కొమ్ముకోనెం చేపలు చిక్కాయి. బరువు పెద్దగా ఉండటంతో వలను పైకి తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొమ్ముకోనెం చేప మత్స్యకారుడిని తన కొమ్ముతో పొడిచి చంపేసింది. అప్పటి నుంచి విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లాలి అంటే మత్స్యకారులు భయపడుతున్నారు.
Read: అరెస్ట్ చేసిన ఉద్యోగులను భేషరతుగా విడుదల చేయాలి.. రేపు కార్యాచరణ ప్రకటన
