NTV Telugu Site icon

36వ రోజు రైతుల మహాపాదయాత్ర

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నేడు 36వ రోజుకు చేరుకుంది. గత నెల 1న ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర 45 రోజుల పాటు సాగి డిసెంబర్‌ 15న తిరుమలలో ముగుస్తుంది. అయితే ఏపీలో ఇటీవల భారీ వర్షాలు సంభవించడంతో అమరావతి రైతుల జేఏసీ రెండు సార్లు పాదయాత్రకు విరామం ప్రకటించారు. అయితే ఊరురా రాజధాని రైతుల మహాపాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.

నెల్లూరు జిల్లాలో నేడు 36వ రోజు పాదయాత్ర ఉదయం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా వెంగమాంబపురం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర మాటమడుగు, బంగారుపల్లి మీదుగా సాగనుంది. మధ్యాహ్నం బంగారుపల్లిలో భోజనం అనంతరం రాత్రి వెంకటగిరికి పాదయాత్ర చేరుకోనుంది. ఈ పాదయాత్రకు భారీ ఎత్తున రైతులు, ప్రజలు, రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొంటున్నారు.