Site icon NTV Telugu

Gorantla Butchaiah Chowdary: కేసీఆర్‌ నాకంటే జూనియర్.. జగన్ ఓ డిక్టేటర్.. బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary: ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. బుచ్చయ్య చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలకు కేసీఆర్‌, జగన్‌ కారణం అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, “కేసీఆర్‌ నాకంటే జూనియర్‌”, “జగన్‌ ఒక డిక్టేటర్‌” అంటూ చేసిన చర్చకు దారితీశాయి. ఇక, చంద్రబాబు విజనరీ నాయకత్వాన్ని పవన్‌ కల్యాణ్‌ అర్థం చేసుకున్నారని, వైసీపీ మాత్రం సినిమా రంగంలోని వ్యక్తుల ద్వారా పవన్‌ను రెచ్చగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఎన్ని అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి కొనసాగుతుందని, ఇది ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన బలమైన రాజకీయ భాగస్వామ్యం అని స్పష్టం చేశారు.

Read Also: Anaganaga Oka Raju : గ్రాండ్ గా ‘అనగనగా ఒక రాజు’తో ప్రీ రిలీజ్ ఈవెంట్..

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల విషయంలో ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని విమర్శించారు బుచ్చయ్య చౌదరి.. వైఎస్‌ జగన్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు.. ఆయన డిక్టేటర్‌ అంటూ మండిపడ్డారు. గోదావరిపై ఏపీ దిగువ రాష్ట్రం అయినప్పటికీ, బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు ఏపీ హక్కు అని, వాటిపై అనవసర రాద్ధాంతం చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని అన్నారు. అధికారం కోల్పోయినప్పుడల్లా చంద్రబాబుపై ఏడవడం కేసీఆర్‌ నైజం అంటూ ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌, జగన్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్ర సమస్యలను పరిష్కరించకుండా అడ్డుకున్నారని, తాను మాత్రం తెలుగు యూనివర్సిటీ సమస్యను పరిష్కరించి చూపించానని గుర్తుచేశారు బుచ్చయ్య చౌదరి… విభజన సమస్యలు కొనసాగకుండా ఉండాలంటే నాయకత్వంలో చిత్తశుద్ధి ఉండాలి, అది టీడీపీకే ఉందని అన్నారు. మరోవైపు, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నేతలకు గతంలోనే నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పానని, కానీ తన మాట వినకపోవడం వల్లే ఇప్పుడు వారు చట్టపరమైన, రాజకీయపరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని, ఈ విషయాన్ని కాకినాడ మాజీ మంత్రి కన్నబాబుకు కూడా గతంలోనే హెచ్చరించానని తెలిపారు. మరోవైపు, అన్ని పార్టీల నేతలు, ప్రజలు తనను గౌరవిస్తారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ నిక్కచ్చిగా మాట్లాడే నాయకుడిగా ప్రజల్లో తనకు విశ్వసనీయత ఉందని తెలిపారు సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి..

Exit mobile version