Site icon NTV Telugu

Minister Nara Lokesh: నేడు రాజమండ్రికి మంత్రి నారా లోకేష్..

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి (HRD), ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విస్తృతంగా పర్యటించనున్నారు.. పర్యటనలో భాగంగా ఉదయం 7.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, ఉదయం 8.05 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 8.10 గంటలకు విమానంలో ప్రయాణించి, ఉదయం 8.45 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

Read Also: CM Chandrababu Delhi visit: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేడు అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ..

ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల (Government Arts College)కు చేరుకుని, అక్కడ నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి చేరుకుని, అక్కడ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1.00 గంటల వరకు కొనసాగుతుంది. తదుపరి మధ్యాహ్నం 1.30 గంటలకు రాజమహేంద్రవరం చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 5.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని, 5.45 గంటలకు విమానంలో బయలుదేరి, సాయంత్రం 6.15 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తన నివాసానికి చేరుకుంటారు.

Exit mobile version