Site icon NTV Telugu

కొరియా వ్యాధి గురించి ఎప్పుడైనా విన్నారా?

ప్ర‌పంచంలో ఎన్నో వింతైన వ్యాధులు ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనాతో యావ‌త్ ప్ర‌పంచం ఇబ్బందులు ప‌డుతున్న‌ది. రెండేళ్లుగా ప్ర‌జ‌లు స‌రిగా ప‌నులు చేసుకోలేక‌పోతున్నారు. థ‌ర్డ్ వేవ్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఈ మ‌హ‌మ్మారి మ‌రింత‌గా ఇబ్బందులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రపంచంలో కొన్ని అరుదైన వ్యాధులు కూడా ప్ర‌పంచాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. అందులో కొరియా వ్యాధి కూడా ఒక‌టి. వ్య‌క్తి ప్ర‌మేయం లేకుండా శ‌రీరంలోని అవ‌య‌వాలు వాటంత‌ట అవే క‌దులుతుంటాయి. నాలుక సైతం స్వాధీనంలో లేక‌పోవడంతో ఆహ‌రం తీసుకోవ‌డం కూడా ఇబ్బందిక‌రంగా మారుతుంది.

Read: కాంగ్రెస్‌ నాయకుల కృషితోనే సభ్యత్వాల పూర్తి : మహేష్‌ గౌడ్‌

ఈ వ్యాధి చాలా కొద్ది మందిలో మాత్ర‌మే క‌నిపిస్తుందని, యూపీఎస్ 13 ఏ అనే జీన్ మ్యూటేష‌న్ చెంద‌డం వ‌ల‌న ఈ అరుదైన వ్యాధి బారిన ప‌డ‌తార‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ ర‌కం వ్యాధితో క‌ర్నూలు జిల్లాకు ఓ మ‌హిళ ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు గుర్తించారు. నెల రోజుల ట్రీట్మెంట్ త‌రువాత ఆమెకు న‌యం అయిన‌ట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధిని కొరియా అకాంటో సైటోసిస్ అని పిలుస్తార‌ట‌. స‌కాలంలో గుర్తిస్తే వ్యాధిని న‌యం చేయ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.

Exit mobile version