NTV Telugu Site icon

Heavy Rains: తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు

Heavy Rains

Heavy Rains

Heavy Rains: వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఏపీలకు తుపాను ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దీంతో ఉరుములు, మెరుపులు వచ్చినా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీకి కూడా వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్‌, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

Read also: Skill University Admission: నేటి నుండి స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభం…

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీలోగా ఇది మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తాజా తుపాను హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అక్టోబర్ 12 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని 9 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Jani Master Case: జానీ మాస్టర్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌..! ఆమె నాపై లైంగికదాడి చేసిందంటూ యువకుడి ఫిర్యాదు..