Site icon NTV Telugu

బిగ్ బాస్ షో కాదు… బ్రోతల్ హౌస్ లా ఉంది : సిపిఐ నారాయణ

విజయవాడ : బిగ్ బాస్ షో పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. అది బిగ్ బాస్ షో కాదని… బ్రోతల్ హౌస్ లా ఉందని ఫైర్‌ అయ్యారు. యువతీ యువకును గదిలో బంధించి ఏం చేయిస్తున్నారని… వినోదం పేరుతో వికృత చేష్టలను ఎలా సమర్ధిస్తామని ప్రశ్నించారు. నేటి యువతరానికి ఎటువంటి మసేజ్ లు ఇస్తున్నారని… ప్రజలు ఆదరిస్తున్నారు కదా అని… ఇష్టం వచ్చినట్లు చేస్తారా ? అని నిప్పులు చెరిగారు. నాగార్జున వంటి వారు ఇటువంటి షోలను సమర్ధించడం సరి కాదని… వెంటనే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. సినిమా టిక్కెట్లను ప్రభుత్వం విక్రయించడాన్ని సమర్ధిస్తున్నానని… వందల కోట్లతో సినిమాలు తీసి… ప్రజల నుంచి వసూళ్లు చేయాలను కోవడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాక ఇబ్బందులు పై చర్చించాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version