మైనారిటీలకు కూడా అత్యున్నత పదవులు లభిస్తాయని జగన్ మరోసారి నిరూపించారు. ఏపీ శాసన మండలిలో ఓ ముస్లిం మహిళకు డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవి కట్టబెట్టారు. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కాసేపు జగన్ తో ముచ్చటించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ జకియా ఖానమ్.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ…
ఈ రోజు అధ్యక్షా అని సంభోదించే స్ధానంలో నా అక్క జకియా ఖానమ్ అమ్మ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ చైర్మన్‌గా ఈ రోజు ఆ స్ధానంలో కూర్చున్నారు. నిజంగా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి… ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి, ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలి అన్న మన ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైయస్.జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
