Site icon NTV Telugu

YS Jagan: నేడు మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన..

Jagan

Jagan

YS Jagan: ఇవాళ మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దెబ్బ తిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా 11 గంటలకు పెడన నియోజకవర్గంలోని గూడూరుకు చేరుకోనున్నారు.

Read Also: Australia Squad: భారత్ టీ20 సిరీస్ నుంచి ట్రవిస్‌ హెడ్‌ ఔట్.. కారణం అదేనా?

ఇక, ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, స్థానిక రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి అవనిగడ్డ బైపాస్ మీదుగా 2 గంటలకు తన నివాసానికి చేరుకోనున్నారు.

Exit mobile version