CM YS Jagan Mohan Reddy Removes Cable Operators Poll Tax: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ ట్యాన్స్‌ను రద్దు చేశారు. ఈ విషయాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గతంలో పాదయాత్ర సందర్భంగా.. పోల్ ట్యాక్స్ ఇబ్బందులను జగన్ దృష్టికి కేబుల్ ఆపరేటర్లు తెచ్చారని, అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న ఆయన సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. త్వరలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఒక కొత్త టీవీ చానల్‌ను తీసుకొస్తామని.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆ చానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని గౌతమ్ రెడ్డి వివరించారు.
కాగా.. అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతైన ఘటన మీద సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. సహాయ చర్యలు పర్యవేక్షించాలని మంత్రి అమర్నాథ్‌కు నిర్దేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అటు.. బీచ్‌లో గల్లంతైన విద్యార్థుల కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ సిబ్బంది గాలిస్తున్నాయి. గల్లంతైన విద్యార్థులను జగదీశ్ (గోపాలపట్నం), జస్వంత్ (నర్సీపట్నం), గణేశ్ (మునగపాక), రామచందు (యలమంచిలి), సతీశ్ (గుంటూరు)లుగా గుర్తించారు.
