Site icon NTV Telugu

ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు

అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు.

అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆదిమూలపు సురేష్, శంకరనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, తానేటి వనిత, గుమ్మనూరి జయరాం, అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్ పాల్గొన్నారు.

Exit mobile version