NTV Telugu Site icon

CM Jagan Humanity: మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌

CM Jagan 1

Collage Maker 23 Dec 2022 05.53 Pm (1)

ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం జగన్. తన కడప పర్యటనలో సీఎంని కలిసి తమ కుమారుడి అనారోగ్య సమస్యను వివరించాడు భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు. వెంటనే స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే రూ. 1 లక్ష ఆర్ధిక సాయం అందించనున్నారు జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు.

Read Also: CM Jagan Mohan Reddy: అప్పుడు DPT.. ఇప్పుడు DBT.. తేడా చూడండి

భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు, తను కడపలో రోజూ కూలీపనికి వెళుతూ జీవనం సాగిస్తున్నానని తెలిపాడు. అయితే, తన కుమారుడు నరసింహ (12 సంవత్సరాలు) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ ఇబ్బందిని ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం నరసింహ కుటుంబానికి వెంటనే రూ. 1 లక్ష ఆర్ధిక సాయం చేయాలని, అంతేకాక ఆ బాలుడి వ్యాధికి మెరుగైన చికిత్సకు ఎంత ఖర్చు అయినా, ఎక్కడైనా సరే చేయించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు ఓబులేసు కుటుంబసభ్యులు.

Read Also: IPL Auction 2023 Live Updates: మనీష్ పాండేను కొనుగోలు చేసిన ఢిల్లీ