NTV Telugu Site icon

CM Jagan : భారత అంతరిక్ష సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లింది

భారత అంత‌రిక్ష పరి‌శో‌ధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎ‌స్‌‌ఎ‌ల్‌‌వీ–సీ52 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహ‌రి‌కో‌ట‌లోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ లాంచ్‌ ప్యాడ్‌ నుంచి దీనిని ప్రయోగించారు. 25 గంటలపాటు కౌంట్‌డౌన్‌ ముగించుకుని సోమవారం ఉదయం 5.59 గంటలకు ప్రయోగించిన రాకెట్‌ నింగిలో లక్ష్యం దిశగా వెళ్లింది. ఇది మూడు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్తోంది. ఇస్రో ఈ ఏడా‌దిలో చేప‌డు‌తున్న మొదటి ప్రయోగం ఇదే కావడం గమ‌నార్హం. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ52ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందనలు అని ఆయన అన్నారు. ఈ విజయం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లిందని, భవిష్యత్ ప్రయత్నాలలో ఇస్రో విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అయితే.. వ్యవసాయ, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్‌ఐశాట్‌-1 ఉపగ్రహం, భారత్‌, భూటాన్‌ సంయుక్తంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌-2టీడీ ఉపగ్రహం.