NTV Telugu Site icon

Polavaram Project : సీఎం జగన్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ పర్యటన

నేడు సీఎం జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో కలిసి తూర్పు ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీల సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు దేవీపట్నం మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకుంటారు. అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి ఉదయం 10.10 గంటలకు ఇందుకూరుపేట-1 పునరావాస కాలనీకి వస్తారు.

ఆ తరువాత కాలనీని 10.40 గంటలకు పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడతారు. 11 గంటలకు ఇక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి పశ్చిమగోదావరి వెళ్తారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యాటన నేపధ్యంలో తూర్పు ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పారమిలటరీ దళాలతో భద్రతతో బందోబస్తు ఏర్పాటు చేశారు.