School Holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. ఏపీ, తెలంగాణల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సెలవుల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా క్రిస్మస్ సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈరోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆప్సనల్ సెలవులు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25, 26 తేదీలను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించారు. డిసెంబర్ 25 క్రిస్మస్ అయితే, డిసెంబర్ 26 బాక్సింగ్ డే 2024, కాబట్టి ఈ రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయి.
Read also: Daaku Maharaj : డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్ ప్రైజ్ గెస్ట్
అయితే ఇవాళ (డిసెంబర్ 24)వ తేదీ ఆప్సనల్ సెలవు కావడంతో కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఇవాళ (డిసెంబర్ 24న) సెలవు ఇస్తే దానికి బదులు మరో రోజు పాఠశాలలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం కూడా 2025 సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్, ఆప్సనల్ సెలవుల జాబితాను ఇటీవల ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్సనల్ సెలవులు జాబితాలో చేర్చారు. ఈ సెలవుల్లో మొదటిది కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1, 2025న సెలవుదినం. బదులుగా, ఫిబ్రవరి 10వ తేదీని రెండవ శనివారం పనిదినంగా ప్రకటించారు.
Read also: Daaku Maharaj : డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్ ప్రైజ్ గెస్ట్
మరోవైపు ఏపీలో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. అలాగే డిసెంబర్ 24, 26 తేదీలను ఆప్సనల్ సెలవులుగా ప్రకటించారు. దీంతో ఈసారి క్రిస్మస్ పండుగకు పాఠశాలలు, కళాశాలలకు ఒక్కరోజే సెలవు. అయితే, క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలు, కళాశాలలకు ఆప్సనల్ సెలవులు కూడా ఇచ్చారు.
KBR Park: కేబీఆర్ పార్క్‌కు వెళ్లాలంటే నెలకు రూ.1000 కట్టాల్సిందే..