Site icon NTV Telugu

YSRCP Leader Attacked: వైసీపీ నేత హరిప్రసాద్‌ రెడ్డిపై దాడి.. ఒక మహిళతో కారులో వెళ్తుండగా..!

Ysrcp Leader Hariprasad Red

Ysrcp Leader Hariprasad Red

YSRCP Leader Attacked: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి ప్రాంతంలో ఓ మహిళతో కలిసి కారులో వెళ్తుండగా, ఆమె భర్త అడ్డుకుని హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేసినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం, హరిప్రసాద్ రెడ్డితో పాటు కారులో ఉన్న మహిళపైనా దాడి జరిగింది. అనంతరం ఇద్దరినీ కారులో నుంచి బయటకు లాగి కొట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడికి కారణం మహిళతో హరిప్రసాద్ రెడ్డికి అక్రమ సంబంధం ఉందనే అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.

Read Also: Aishwarya Rajesh : డోర్ మూసేసి..బాడీ చూపించమన్నాడు..గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన ఐశ్వర్య రాజేష్!

దాడి చేసిన వ్యక్తి సదరు మహిళ భర్తగా, తిరుపతి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్‌గా స్థానికులు చెబుతున్నారు. దాడి అనంతరం హరిప్రసాద్ రెడ్డి కారును ధ్వంసం చేసి, ఆ మహిళను తనతో పాటు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ దాడిపై హరిప్రసాద్ రెడ్డి ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. మహిళతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Exit mobile version