NTV Telugu Site icon

President Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మూకే టీడీపీ మద్దతు

Chandrababu 1

Chandrababu 1

రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్ధతు ప్రకటించింది. టీడీపీ స్ట్రాటజీ కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో కె.ఆర్.నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాంలను టీడీపీ బలపరిచింది. నంద్యాలలో పీవీ నరసింహారావును టీడీపీ బలపరిచిందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. చంద్రబాబు నేతృత్వంలో స్ట్రాటజీ కమిటీ భేటీ జరిగింది. రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుందన్నారు. వైసీపీ ప్లీనరీ, సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరిగింది.

లోక్ సభ స్పీకర్ గా బాలయోగిని, శాసనసభ స్పీకర్ గా ప్రతిభా భారతిని టిడిపి చేసింది. కేంద్ర మంత్రిగా ఎర్రంనాయుడుని చేయడం ద్వారా తెలుగుదేశం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది. తెలుగు బిడ్డ పి.వి. నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచింది. తెలుగు వారి కోసం, సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందు వరుసలో నిలబడిందన్నారు చంద్రబాబు.

అమ్మను గెంటేసినవాడు ప్రజలకేం చేస్తాడు? జగనుది విశ్వసనీయత కాదు.. విషపునీయత. మద్య నిషేధం, సీపీఎస్, అమరావతిపై మాట తప్పి మడమ తిప్పడం విశ్వసనీయతా? వైసీపీ ప్లీనరీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. చిన్నాన్నపై గొడ్డలివేటు వేసిన నేరస్థుల్ని కాపాడటం విశ్వసనీయతా? పులివెందులలోనే జగన్ను ఓడించడానికి పులివెందుల ప్రజలు ఎదురు చూస్తున్నారు. అమ్మని గెంటేసిన వాడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏం చేస్తాడు..? స్కూల్ పిల్లలకు ఏం చేస్తాడు..?

జగన్ ఓటమి భయంతోనే టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. జగన్ కన్నా చంద్రబాబు సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేశారు. పాఠశాలల విలీనం ఉపసంహరించుకోవాలి.
51 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి. మోటార్లకు మీటర్లు కేంద్రం ఉపసంహరించుకుంది.. దీనిపై జగన్ వైఖరి చెప్పాలి. మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ సంఘీభావం తెలుపుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రత పెంచాలని కోరారు.

CM Jagan: గృహ నిర్మాణ శాఖపై జగన్ కీలక ఆదేశాలు

Show comments