Site icon NTV Telugu

ఏపీ గ‌వ‌ర్న‌ర్‌కు చంద్రబాబు లేఖ

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. కరోనా వేళ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, సామాన్య ప్రజలను అర్థం లేని వేధింపులకు గురి చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత కరోనా కారణంగా ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆదుకునే ప్రభుత్వము, స్నేహ హస్తం అందించే పోలీసులు ప్రజలకు కావాలి. విశాఖలో నడిరోడ్డుపై దళిత యువతి లక్ష్మీ అపర్ణను పోలీసులు అడ్డుకున్న తీరును ప్రస్తావిస్తూ.. ప్రజల హక్కులను హరిస్తున్న వైనాన్ని వివరించారు. వైసీపీ పాలనలో కొందరు పోలీసుల తీరు, నిరంకుశ పాలకుల ప్రైవేటు సైన్యమన్నట్టుగా ఉంటోంది. ప్రజల హక్కులను హరిస్తోంది, కాబట్టి ఒక రాష్ట్రాధిపతిగా వ్యవస్థను చక్కదిద్దే దిశగా ఈ విషయంలో చొరవతీసుకోవాలని కోరారు.

Exit mobile version