Site icon NTV Telugu

చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం చేస్తున్నారు : చంద్రబాబు

chandrababu

chandrababu

విశాఖ జిల్లా విద్యుత్ ఉద్యోగి లైన్ మెన్ బంగార్రాజు హత్యపై డిజిపి గౌతం సవాంగ్‌కు లేఖ రాసారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందులో… విద్యుత్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తూ దారుణ హత్యకు గురైన బంగార్రాజు మృతదేహం ఏనుగులపాలెంలోని మంత్రి బొత్స మేనల్లుడు లక్ష్మణరావు గెస్ట్‌ హౌస్‌ పక్కనే లభ్యమైంది. మృతదేహం లభ్యమై నాలుగైదు రోజులైనా ఇంకా పోస్ట్‌మార్టం నిర్వహించకపోవడం విచారకరం. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం చేస్తున్నారు. బంగార్రాజు హత్యలో అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన అగ్ర నేతల ప్రమేయం ఉండడంతోనే పోలీసులు ఈ కేసులో ముందుకెళ్లకుండా వెనుకంజ వేస్తున్నారు. పోలీసులు సత్వరం విచారణ చేపట్టి.. బాధితులకు న్యాయం చేయాలి. విశాఖ జిల్లా ప్రశాంతతకు మారుపేరు.. కానీ, నేడు శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. భూకబ్జాలు, హత్యలతో విశాఖ క్రైమ్ సిటీగా మారిపోయింది అని పేర్కొన్నారు.

Exit mobile version