విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రోడ్ మాప్ సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు, అభ్యంతరాలు తెలిపినప్పటికీ… పట్టించుకోకుండా కేంద్రం ముందుకు వెళుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
read aslo : మగువలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌తో దాని అనుబంధ సంస్థలన్నీ వంద శాతం అమ్ముతామని కేంద్రం ప్రకటించింది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మకానికి పెట్టింది కేంద్రం. బిడ్‌లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్ గ్యారంటీ చూపాలని నోటిఫికేషన్ లో కేంద్రం పేర్కొంది.
