Site icon NTV Telugu

ఆనందయ్య మందు తయారీకి బ్రేక్…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు చర్చాంశనీయంగా మారింది. అయితే మొదట ఈ ముందుకు బ్రేక్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్నటి నుండి మందు పంపిణి ప్రారంభించారు. అయితే తాజాగా కడపలో ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీకి బ్రేక్ పడింది. వనమూలికలు, తేనే, ముడి సరుకు నిర్వాహకులు సిద్దం చేసుకున్నారు. అయిన ఆనందయ్య శిష్యులు నేడు రాకపోవడంతో మందుల తయారీ, పంపిణీ వాయిదా వేసినట్లు నిర్వాహకులు ఏపీ పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి తెలిపారు. రెండు రోజుల తర్వాత పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Exit mobile version