వివేకా హత్యకేసులో అడ్డంగా దొరికి కూడా సలహాదారులు బ్లాక్‌మెయిల్ చేస్తూ, స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణను సజ్జల తప్పుపట్టడం బరితెగింపేనని ఆయన విమర్శించారు. అంతేకాకుండా హత్యకు ప్రధాన కారణం అవినాష్ రెడ్డేనని సీబీఐ స్పష్టం చేసినా.. ఇంకెంతసేపు బొంకుతారనని ఆయన వ్యాఖ్యానించారు. హత్య చేసిన వారిని, చేయించిన వారిని కాపాడే ప్రయత్నం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరిన విషయం మరిచారా..? అని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక అవినాష్ రెడ్డిని కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ విచారణ వద్దని కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం వాస్తవం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌పై నమ్మకం లేకే సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఆయన వెల్లడించారు.
Bonda Uma: వివేకా హత్యకేసులో అడ్డంగా దొరికి కూడా..
