Site icon NTV Telugu

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలేవి? జగన్‌కి సోము వీర్రాజు లేఖ

సీఎం జగన్‌కి బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ. ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న ప్రొత్సహాకాలను ఎందుకివ్వడం లేదని లేఖలో ప్రశ్నించారు సోము వీర్రాజు. పంచాయతీ నిధులకు పారదర్శకత ఏది..? ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్ళకు ప్రోత్సాహక నగదు ఏది..? అంటూ తన లేఖలో ప్రశ్నలు సంధించారు సోము వీర్రాజు.

జీవో విడుదల చేసి నవ మాసాలు నిండినా అమలు చేయరా..? అని అన్నారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే గతంలో వేలల్లో ఉండే ప్రోత్సాహకాన్ని లక్షల్లోకి మార్చారు. ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం జనాభా ప్రాతిపదికన రూ. 5 నుంచి రూ. 20 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు. 2,199 పంచాయితీలు ఏకగ్రీవం చేసుకుంటే కనీసం నయాపైసా ప్రోత్సాహకం అందించలేదు. మాట తప్పను, మడమ తిప్పననే సీఎం జగన్.. పంచాయతీలకు ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రోత్సాహకాల కోసం విడుదల చేసిన ఉత్తర్వులు ఉత్తుత్తివి కాదని నిరూపించాలన్నారు సోము వీర్రాజు.

Exit mobile version