NTV Telugu Site icon

జగన్‌ ను కలిసి బద్వేల్‌ ఎమ్మెల్యే దాసరి సుధ

ఇటీవల జరిగిన బద్వేల్‌ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలిచారు. బద్వేల్‌లో గెలుపు అనంతరం మొదటి సారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ మేరుకు బద్వేల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దాసరి సుధకు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. ఆమె వెంట కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి లు ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు.