NTV Telugu Site icon

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం..

తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం పాలకాలువ వద్ద ఎదరురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో రెండు బైక్‌లపై ఉన్న నలుగురు కింద పడగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మరొకరికి తీవ్ర గాయాలవడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుప్రతికి తరలించారు. ఆ వ్యక్తి కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు జాగారంపల్లికి చెందిన రమేష్‌, శేఖర్‌, రాజబాబు, పండులుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.