ఎలక్ట్రిక్ బస్సులను నడిపే అంశంపై మళ్లీ ఫోకస్ పెట్టింది ఏపీ ఆర్టీసీ. 350 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై బిడ్లను ఆహ్వానించిన ఏపీఎస్సార్టీసీ… విశాఖకు 100, విజయవాడ, తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్, కాకినాడ, అమరావతికి నగరాలకు 50 బస్సులు చొప్పున కేటాయించింది ఏపీ ప్రభుత్వం. కేంద్రం నుంచి ప్రొత్సహకం రూపంలో బస్సుకు రూ. 55 లక్షలు రానున్నాయి. గతంతో పోలిస్తే ఈ-బస్ బ్యాటరీ ధరలు తగ్గాయి. 50 శాతం మేర బ్యాటరీ తగ్గడంతో నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందంటున్న ఆర్టీసీ… ఈ నెల 9వ తేదీలోగా బిడ్లు దాఖలుకు చివరి తేదీ ఖరారు చేయనుంది. గతంలో ఈ-బస్‌ల నిర్వహణ ప్రతిపాదనను పరిశీలించి జూడిషీయరీ ప్రివ్యూ అభ్యంతరాలతో వెనక్కు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుండడంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనను మళ్లీ తెర మీదకు తెచ్చింది. చూడాలి మరి ఏం జరగనుంది