Site icon NTV Telugu

AP Deputy CM Pawan: గ్రామాల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు..

Pawan

Pawan

AP Deputy CM Pawan: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( MGNREGS) యొక్క సోషల్ ఆడిట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌ (ట్విటర్) వేదికగా పంచుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాయని వెల్లడించారు.

Read Also: Jiiva: బ్లాక్‌ బస్టర్ డైరెక్టర్‌ తో జీవా ప్రయోగం

ఇక, MGNREGS ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతుండటంతో, రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అధికారుల పని తీరును ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ ద్వారా సమీక్షిస్తూ, నాణ్యతా తనిఖీలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించడం వల్ల ఇతర రాష్ట్రాల అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ పని తీరును మెచ్చుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Exit mobile version