Site icon NTV Telugu

PRC Issue: విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి చర్చలు..

సచివాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో సమావేశం అయ్యారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులోని అంశాలపై జేఏసీ నేతలతో చర్చలు జరుగుతున్నాయి.. 24 డిమాండ్లతో ప్రభుత్వానికి జనవరి 28న విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణను జేఏసీ వ్యతిరేకిస్తోంది.. విద్యుత్ ఉద్యోగుల వేతనాలపై ఏర్పాటు చేసిన పీఆర్సీను కూడా వ్యతిరేకిస్తోన్న జేఏసీ.. పీఆర్సీ బాధ్యతలను విద్యుత్ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులకే ఇవ్వాలని నోటీసుల్లో డిమాండ్‌ చేసింది.. విద్యుత్ సంస్థల్లో పని చేస్తోన్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసులను రెగ్యులర్ చేయాలని డిమాండ్‌ కూడా ఉన్నాయి.. ఉద్యోగులు వారి కుటుంబాలకు అపరిమిత వైద్యం అందించాలని నోటీసులో పేర్కొన్న జేఏసీ.. విద్యుత్ సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టాలంటోంది.. విద్యుత్ ఉద్యోగులపై వేధింపులు ఆపడం, తదితర సమస్యలపై ఉద్యోగుల జేఏసీ నోటీసులు ఇచ్చింది… ఇవాళ జేఏసీ నేతలతో సమావేశమైన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. వారి అన్ని డిమాండ్లపై చర్చలు జరుపుతున్నారు.

Read Also: CM YS Jagan: ఆదాయ వనరులపై సర్కార్ ఫోకస్..

Exit mobile version